పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో భారీ తిరుగుబాటు.. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వేలాదిమంది ప్రజలు

చరిత్రలోనే అతిపెద్ద నిరసనలకు పీఓకే సిద్ధం అవుతోంది. అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు.. ప్రాథమిక హక్కులు, ఆర్థిక సంస్కరణల కోసం సోమవారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించింది. ముఖ్యంగా 12 మంది కాశ్మీరీ శరణార్థుల అసెంబ్లీ స్థానాల రద్దు, సబ్సిడీ గోధుమ పిండి, మంగ్లా ప్రాజెక్ట్‌కు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు సహా పలు డిమాండ్లతో ఏఏసీ ఆందోళనలకు దిగింది. దీంతో పాక్ సర్కార్ పీఓకేలో ఇంటర్నెట్‌ను నిలిపివేసి.. వేలాది భద్రతా బలగాలను మోహరించింది. చర్చలు విఫలం కావడంతో.. ఈ ఆందోళనలు తీవ్రం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.