రాష్ట్రంలో ప్రతీ ఇంటికి జీఎస్టీ ఫలాలు అందాలని...రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలు, వినియోగదారుల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేసేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 19వ తేదీ వరకు వేర్వేరు థీమ్‌లతో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ కమిటీకి సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ...ఇప్పటికే ‘ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు’ థీమ్‌తో నిత్యవసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించామని, క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన కల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు., News News, Times Now Telugu