రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. చంద్రబాబుతో భేటీ తర్వాత సాయికృష్ణ కుటుంబం

గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చిందని అతని కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. దీని వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని.. న్యాయం జరగాలని మాత్రమే కోరుకున్నట్లు సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాకు తెలిపారు.