IMD Alert: జూలై నెలలో అంతంత మాత్రమే.. దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం!

నైరుతి రుతుపవనాల రాక కోసం, స్థిరమైన వానచినుకుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న భారతీయ రైతన్నలకు, సామాన్య ప్రజానీకానికి మరికొన్ని రోజులు నిరాశ తప్పేలా లేదు. జూన్ నెలలో తీవ్రమైన వర్షపాత లోటును ఎదుర్కొన్న దేశానికి, జూలై నెలలోనూ పెద్దగా ఊరట లభించే సూచనలు కనిపించడం లేదు. ఈ జూలైలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ (IMD)విడుదల చేసిన అంచనాల్లో స్పష్టం చేసింది. 1901 తర్వాత దేశంలో ఐదవ అత్యంత పొడి జూన్ నెల నమోదైన నేపథ్యంలో, తాజా హెచ్చరికలు వ్యవసాయ రంగంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.