Telangana: ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో ప్రతి పౌరుడు పొందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (యూనిఫైడ్ కార్డ్) తీసుకురానుంది. ఈ కార్డు ద్వారా లబ్ధిదారుడు ఏ శాఖ నుంచి, ఏ పథకం కింద, ఎంత మేర ప్రయోజనం పొందుతున్నాడో పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖల లబ్ధిదారుల డేటాను సమీకరించి పారదర్శకంగా సంక్షేమ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్డు అమల్లోకి వస్తే సంక్షేమ పథకాల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంటుందన్నారు.