"అది డ్రగ్స్ కాదు.. నా కూతురి మెడిసిన్": డ్రగ్స్ వివాదంలో చిక్కుతున్న తమిళనాడు మంత్రి శరత్‌కుమార్ క్లారిటీ

తమిళనాడు రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం రేగింది. టీవీకే ప్రభుత్వంలో మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్న డి. శరత్‌కుమార్ ఓ పాత వీడియో కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మొబైల్ స్క్రీన్‌పై ఏటీఎం కార్డుతో ఒక తెల్లని పౌడర్‌ను పొడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆయన డ్రగ్స్ వాడుతున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే అది డ్రగ్స్ కాదని, తన ఏడాదిన్నర కుమార్తెకు వైద్యుల సలహా మేరకు ట్యాబ్లెట్‌ను పొడి చేశానని మంత్రి వివరణ ఇచ్చినప్పటికీ.. గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది.