'జనానికి కరెంట్ కోతలా?': అధికారుల ఇళ్లకే కరెంట్ కట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తన నియోజకవర్గ ప్రజలు కరెంట్ లేక అల్లాడిపోతుంటే.. చల్లని ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్న అధికారులకు ఒక ఎమ్మెల్యే ఊహించని షాక్ ఇచ్చారు. కేవలం వినతులు ఇవ్వడం, ధర్నాలు చేయడం కాకుండా.. ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కి అధికారుల ఇళ్లకే కరెంట్ కట్ చేశారు. హరిద్వార్ జిల్లా జబ్రేడా ఎమ్మెల్యే వీరేంద్ర జాతి చేసిన ఈ వినూత్న నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రజలకు లేని విద్యుత్.. మీకు ఎందుకు? అంటూ చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారుల ఇళ్లకే కరెంట్ సరఫరాను నిలిపివేసి, సామాన్యుడి కష్టాన్ని అధికారులకు రుచి చూపించారు.