జపాన్‌లో భారీ భూకంపం.. ఉత్తర తీరంలో 7.4 తీవ్రతతో ప్రకంపనలు.. సునామీ హెచ్చరికలు జారీ

ప్రకృతి ప్రకోపానికి జపాన్ మరోసారి వణికిపోయింది. ముఖ్యంగా అక్కడి సముద్ర గర్భంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. వాతావరణ శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 10 అడుగుల ఎత్తున విరుచుకుపడే అలలు తీరాన్ని ముంచెత్తక ముందే.. నదీ పరివాహక ప్రాంతాల్లోని, తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. సముద్ర గర్భంలో సంభవించిన ప్రకంపనల ధాటికి.. టోక్యో నగరం మొత్తం ఊగిపోయింది. అక్కడి ఎత్తైన భవనాలు అన్నీ కొద్ది సెకన్ల పాటు గాలి మేడల్లా ఊగాయి.