తెలంగాణను వీడని వానలు.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పారు. ఇక వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగి, 2వేల ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి.