"ఫ్లాట్ చేతికొచ్చినా.. ఆలస్యానికి పరిహారం కోరవచ్చు": సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రియల్ ఎస్టేట్ బిల్డర్ల ఏకపక్ష వైఖరికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీం కోర్టు కొనుగోలుదారుల హక్కులను మరింత బలోపేతం చేసింది. ఫ్లాట్ లేదా ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా.. నిర్మాణంలో జరిగిన ఆలస్యానికి గానూ బిల్డర్ల నుంచి ఆర్థిక పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇల్లు చేతికి వచ్చినంత మాత్రాన బిల్డర్ల వైఫల్యాలను ప్రశ్నించే అర్హతను వినియోగదారులు కోల్పోరని జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ మేరకు జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఇచ్చిన 2016 నాటి పాత ఉత్తర్వులను సుప్రీం కోర్టు పూర్తిగా రద్దు చేసింది.