‘ముక్కంటి’ పాలకమండలికి రాష్ట్రస్థాయి ప్రాధాన్యం

శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తలమండలికి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం కల్పించింది. ఇప్పటి వరకు చైర్మన్‌తో పాటు సభ్యులకూ స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించేవారు. కాగా, రాహుకేతు పూజలతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విదేశీ భక్తులూ తరచూ ఆలయానికి వచ్చి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకొంటున్నారు. ఈ క్రమంలో ఆలయానికి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ 16మంది సభ్యులు, ఒక ప్రత్యేక ఆహ్వానితుడితో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యుల వివరాలు ఉన్నాయి.