రైళ్లలో నాణ్యమైన టీ, కాఫీ విక్రయం

రైలు ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడంలో భాగంగా ఆన్‌బోర్డు టీ, కాఫీ విక్రయ వ్యవస్థను వాల్తేరు డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలట్‌ ప్రాజెక్టు కింద ఆన్‌బోర్డు వెండింగ్‌ వ్యవస్థను ఏపీ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఐదు లీటర్ల సామర్థ్యం గల ప్రతి ఇన్సులేటెడ్‌ థర్మోస్‌ కంటైనర్‌ ద్వారా పరిశుభ్రమైన టీ, కాఫీ విక్రయించనున్నారని, దాదాపు 35 మంది ప్రయాణికులకు ఒకేసారి సేవలందించగలరని పేర్కొన్నారు.