సంక్రాంతి ప్రయాణానికి టెన్షన్ లేదు.. 5,500 పైగా స్పెషల్ బస్సులు..

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 5,500 పైగా స్పెషల్ బస్సులు నడపనుంది. జనవరి 9 నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ కోసం కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, బీహెచ్‌ఈఎల్ ప్రాంతం నుంచి కూడా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆర్సీపురం డిపో నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతోంది.