Runa Mafi: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. వారి రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటన..

తెలంగాణలోని చేనేత కార్మికులకు ఊరటనిస్తూ ప్రభుత్వం చేనేత రుణ మాఫీ పథకాన్ని అమలు చేస్తోంది. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు కార్మికులు తీసుకున్న ఒక లక్ష రూపాయల లోపు వ్యక్తిగత రుణాలను రద్దు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా 21 జిల్లాలకు చెందిన 6,784 మంది లబ్ధి పొందనుండగా.. ఇందుకోసం రూ. 27.14 కోట్లు మంజూరు చేశారు. అంతేకాకుండా... టెస్కో (TSCO) ద్వారా రూ. 587 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవగా... చేనేత భరోసా, పావలా వడ్డీ వంటి పథకాల ద్వారా వందల కోట్ల ఆర్థిక సాయం అందిస్తూ, ఇందిరమ్మ చీరల తయారీ ద్వారా వారికి నిరంతర ఉపాధి కల్పించామన్నారు.