అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలుగు దంపతుల మృతి...పిల్లలకు సీరియస్

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా వారి కుమారుడు, కుమార్తె తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్, ఆశ దంపతులు.కృష్ణ కిశోర్ పదేళ్లకు పైగా అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దీంతో అమెరికాలోనే దంపతులు స్థిరపడ్డారు. అయితే 10 రోజుల క్రితమే దంపతులు స్వగ్రామం అయిన పాలకొల్లు వచ్చి కుటుంబ సభ్యులతో సందడిగా గడిపారు. తిరిగి వెళ్లే క్రమంలో దుబాయ్‌లో ఆగి న్యూ ఇయర్ వేడుకలు సైతం జరుపుకున్నారు. అనంతరం అమెరికా వెళ్లిపోయారు. ఇలా కారు ప్రమాదానికి గురవ్వడంతో దంపతులు మృతి చెందారు.ఈ ఘటనతో కృష్ణ కిశోర్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు., News News, Times Now Telugu