ఒమన్‌ తీరంలో ఉద్రిక్తత.. భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై ఇరాన్‌ కాల్పులు.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఒమన్ తీర సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇది నిజమేనని కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టోగో దేశ జెండాతో వెళ్తున్న ఎంటీ సిరాన్ అనే చమురు నౌకపై.. 17 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తుండగా ఇరాన్ తీర రక్షకదళం దాన్ని అడ్డగించింది. హెచ్చరికగా పలు రౌండ్ల కాల్పులు జరిపింది. అయితే అక్కడి పరిస్థితులను పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాయి.