తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెలలోనే నోటిఫికేషన్...ఎన్నికలు అప్పుడేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీ పోరు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఎన్నికల నగారా మోగనుంది.మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీలైంత త్వరగా ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి నెలలోనే ఈ ఎన్నికల తతంగం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగుతారని సమాచారం., News News, Times Now Telugu