ముంబైలోని ఓ రెస్టారెంట్‌‌కు భారీ షాక్.. 10 శాతం సర్వీస్ ఛార్జ్ తీసుకున్నారని ఏకంగా రూ.50 వేల జరిమానా

రెస్టారెంట్ బిల్లులో సర్వీస్ చార్జ్ పేరుతో కస్టమర్ల జేబులకు చిల్లులు పెడుతున్న హోటల్ యాజమాన్యాలకు కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గట్టి షాక్ ఇచ్చింది. సర్వీస్ చార్జ్ వసూలు చేయడం పూర్తిగా ఐచ్ఛికమని తెలిసినప్పటికీ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముంబైలోని ప్రసిద్ధ బోరా బోరా రెస్టారెంట్‌కు రూ. 50,000 జరిమానా విధించింది. భోజనం చేసిన బిల్లుపై అదనంగా 10 శాతం సర్వీస్ చార్జ్ వసూలు చేయడమే కాకుండా దానిపై కూడా జీఎస్టీ వేసి బాదడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక వినియోగదారుడు.. రెస్టారెంట్ మొండివైఖరిని ఎండగడుతూ అథారిటీని ఆశ్రయించారు. ఈక్రమంలోనే సదరు రెస్టారెంట్‌పై జరిమానా పడింది.