ప్రపంచంలోనే లోతైన రోడ్ టన్నెల్.. సముద్రం కింద 1286 అడుగుల్లో నిర్మాణం, రూ.22 వేల కోట్ల ప్రాజెక్టు

ప్రపంచంలోనే అత్యంత పొడవైన, లోతైన నీటి అడుగున రోడ్డు సొరంగాన్ని నార్వే నిర్మిస్తోంది. రొగ్‌ఫాస్ట్ అనే పేరుతో పిలుస్తున్న ఈ అండర్ వాటర్ టన్నెల్‌ను 27 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్నారు. రూ.22 వేల కోట్ల అంచనా వ్యయంతో సముద్ర మట్టానికి ఏకంగా 1,286 అడుగుల లోతులో దాని నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ నార్వే పశ్చిమ తీరం వెంబడి రవాణాను పూర్తిగా మార్చేయనుంది. అంతేకాకుండా బెర్గెన్, స్టావాంగర్ మధ్య 40 నిమిషాల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.