మండలంలోని రాజయ్యపేట, బోయపాడు తీరాల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవున వందల సంఖ్యలో అనేక రకాల చేపలు మృత్యువాత పడి శనివారం కనిపించాయి. తీరం పొడవునా గుట్టలుగా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు హెటెరో, అటు డెక్కన్ రసాయన పరిశ్రమలు శుద్ధి చేయని రసాయన వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలేయడం వల్లే తరచూ మత్స్యసంపద నాశనమవుతోందని ఆరోపిస్తున్నారు. సంధువాలు, కాకిపరిగలు, కానాగడతలు, గుమ్మడిపారలు, తదితర రకాల చేపలు మృతి చెందాయి. విషయం తెలిసి సీఐ జె.మురళి, ఎస్ఐ సాహిబా అంజుమా ఈ తీర ప్రాంతాల్లో పర్యటించి మృత్యువాత పడిన మత్స్య సంపదను పరిశీలించారు.