రైతులకు సంక్రాంతి శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు.. రూ.500 కోట్ల నిధులు విడుదల..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ అన్నదాతలకు తీపి కబురు అందించింది. సన్న వడ్లు పండించిన రైతులకు ప్రకటించిన క్వింటాకు రూ. 500 బోనస్ కోసం పౌరసరఫరాల శాఖ తాజాగా రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం రూ. 1,429 కోట్లను బోనస్ రూపంలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. సన్న రకం ధాన్యం పండించే వారిని ప్రోత్సహించడంతో పాటు.. పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.