స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే.. కోర్టుకు వెళ్లండి: సీఎం రేవంత్ రెడ్డి

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించబోమని.. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని ఆయన కొనియాడారు. మొత్తం 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా.. అందులో 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీలు కూటమిగా పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారని.. కాంగ్రెస్ ఒంటరిగానే 66 శాతం స్థానాలు గెలుచుకుందని రేవంత్ రెడ్డి గణాంకాలతో వివరించారు.