హైదరాబాద్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడి పేరు.. థాంక్యూ ఇండియా అంటూ ట్రంప్ ఎమోషనల్ పోస్ట్!

భాగ్యనగరం వేదికగా భారత్-అమెరికా దౌత్య బంధంలో మరో సరికొత్త మైలురాయి ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ భవనానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం డోనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ అరుదైన గౌరవంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భారత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికన్ ఐటీ దిగ్గజాల కార్యాలయాల చెంతనే ఉన్న ఈ వీధికి తన పేరు పెట్టడం ఒక గొప్ప గౌరవమని, ఈ తరహా గుర్తింపు పొందిన తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.