హమ్మయ్యా బయటపడ్డారు.. ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న తెలుగు ఫ్యామిలీకి ఎట్టకేలకు విముక్తి..

పాస్‌పోర్ట్‌లు ఉన్న బ్యాగ్ పోగొట్టుకుని.. హాంకాంగ్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు కుటుంబానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఆ ఫ్యామిలీ ఇబ్బందుల నుంచి బయటపడింది. షికాగో తిరిగి ప్రయాణమైంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి షికాగో వెళ్తున్న ఓ కుటుంబం పాస్‌పోర్టులు పోగొట్టుకున్న హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయింది. దీంతో పిల్లలతో సహా చిక్కుకుపోయి తాము పడుతున్న ఇబ్బందులపై బొల్లా రాజేశ్వరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేశారు. దీంతో ఈ వ్యవహారంలో నారా లోకేష్ జోక్యం చేసుకోవటంతో.. మూడు రోజుల తర్వాత ఆ కుటుంబం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది.