Cockfight Betting: కాయ్ రాజా కాయ్.. సంక్రాంతి పందెం ఎంతోయ్!

కోడిపందేలు సంప్రదాయంలో భాగమే కావొచ్చు. అదే సంప్రదాయంలో మరో యాంగిల్ కూడా ఉంది. పౌరుషాలకు, పంతాలకు ప్రతీకగా ఈ కోడిపందేలను నిర్వహించేవారు. ఒకనాడు.. కోడిపందేలు ఇలాగే జరిగేవి. బట్ ఇప్పుడు రోజులు మారాయ్. అవే కోడిపందేలు ఇవాళ కోట్లు కుమ్మరించే ఓ వ్యాపారం. కోట్లంటే పదులు, వందలు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపాయలు చేతులు మారేంతగా ఎదిగిన వ్యాపారం అది. పందెం కోళ్లకు, వాటి కాళ్లకు కట్టే కత్తికీ పరిశ్రమలు పుట్టుకొచ్చాయంటే.. 'జస్ట్ కోడిపందేలే కదా' అనే మైండ్ సెట్ నుంచి బయటపడాలి. మున్ముందు అసలు ఆ పేరే మారినా ఆశ్చర్యం లేదేమో. కోడిపందేలు, గుండాట, కోతాట, మద్యం అమ్మకాలు, మాంసం వంటకాల్లో వెరైటీలు, బరుల దగ్గర ఉండే జాతర తరహా ఎన్విరాన్మెంట్.. ఇవన్నీ కలగలిపి ఒక క్యాసినో స్టైల్‌కి మారేలా కనిపిస్తున్నాయ్. ఆల్రడీ ఈ సంక్రాంతి పండక్కి గోదావరి జిల్లాల్లో శ్రీలంక నుంచి క్యాసినో ఎక్స్పర్ట్స్ దిగిపోయారట. ముక్కనుమ తరువాత.. ఆ క్యాసినో కాన్సెప్ట్ ఎంత వరకు సక్సెస్ అయిందో తెలుస్తుంది. అందాకా.. అసలు ఈ సంక్రాంతి ఆరంభం ఎలా జరిగింది? మూడు రోజుల కోడిపందేల తీరు ఎలా ఉండబోతోంది? ఈసారి కోడిపందేల బరుల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారతాయి?