Shashi Tharoor: కేరళ సీఎంగా శశి థరూర్? ఫలితాలకు కొద్ది గంటల ముందు థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Shashi Tharoor: కేరళం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల ముందు రాజకీయ వర్గాల్లో ఓ ప్రశ్న విపరీతంగా వినిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలోకి వస్తే, శశి థరూర్ ముఖ్యమంత్రి అవుతారా? అందరిలో ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు థరూర్ చాలా చాకచక్యంగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానా లేదా అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని తేల్చి చెప్పారు. తనను ఈ ప్రశ్నతో ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించిన థరూర్, కాంగ్రెస్ పార్టీలో ఓ నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుందని గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, పార్టీ అధ్యక్షుడి ప్రతినిధి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని, ఆ తర్వాతే హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో పార్టీకి ఎటువంటి పరిమితులు ఉండవని, ఎవరినైనా ఎంపిక చేసే అధికారం అధిష్టానానికి ఉంటుందని పేర్కొన్నారు.