అమ్మకానికి ఎంసీసీ.. జనవరి 12న వేలం వేయనున్నట్లు నోటీసులు
ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచిన మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) ఆస్తులు ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పులు, ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడంతో 2019లోనే కంపెనీని మూసివేశారు.