ఇబ్బందులు ఎదుర్కున్న ప్రయాణికులకు ఇండిగో బంపరాఫర్.. ఒక్కొక్కరికీ రూ.10 వేల ట్రావెల్ వోచర్లు

సిబ్బంది కొరత కారణంగా విమాన సర్వీసుల రద్దు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఇండిగో సంస్థకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. భద్రతా నిబంధనల అమలులో వైఫల్యం కారణంగా సంస్థ వింటర్ షెడ్యూల్‌లో 10 శాతం విమానాలను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తూ.. ఇండిగో రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అదనపు పరిహారంగా ఇస్తామని ప్రకటించింది. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.