ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్..
గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో సందడి నెలకొంది. రచ్చబండల దగ్గర చర్చలు, దుకాణాల ముందే రాజకీయ వాదనలు, ఇంటింటి ప్రచారాలతో పల్లె వాతావరణం వేగంగా మారుతోంది.