కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రొటోకాల్ పాటించకపోవడం వివాదంగా మారుతోంది. వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మానకొండూర్ శాసనసభ్యుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గతంలో ఒకటిరెండు సార్లు ఉద్దేశపూర్వకంగానే తనపై వివక్ష చూపిస్తున్నారని కవ్వంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వర్గీయులు ఆగ్రహాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన ప్రొటోకాల్ పాటించని వారిపై చర్యకు డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.