గ్యాంగ్‌ రేప్‌ నిందితులకు రిమాండు

జిల్లా కేంద్రం చిత్తూరులో బాలికపై గ్యాంగ్‌రేప్‌ చేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మీడియా సమావేశం పూర్తయ్యాక జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న కోర్టు వరకు నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అంతకుముందు డీపీవో కార్యాలయంలో సీఐలు నిత్యబాబు, మహేశ్వర, శ్రీధర్‌నాయుడితో కలిసి చిత్తూరు డీఎస్పీ సాయినాథ్‌ మీడియాకు వివరాలను తెలియజేశారు. గత నెల 25వ తేదీన చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలో ఉన్న నీవా నగరవనం పార్కులో ఉండిన ఓ ప్రేమజంటలోని బాలికపై ముగ్గురు అత్యాచారం చేసి, వారి వద్ద నుంచి విలువైన వస్తువులను తీసుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో గత నెల 29వ తేదీన తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో వివిధ సెక్షన్ల కింద అత్యాచారం కేసుగా నమోదు చేశారు. ఎస్పీ తుషార్‌ ఆదేశాలతో మూడు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. శుక్రవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు చిత్తూరు నగర పరిధిలోని చెన్నమ్మగుడిపల్లె రహదారి వద్ద వాకర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ట్రాక్‌ వద్ద మురకంబట్టు జీకే నగర్‌కు చెందిన మహేష్‌(21), మురకంబట్టు అగ్రహారానికి చెందిన కిశోర్‌(31), మంగసముద్రానికి చెందిన హేమంత్‌(27)లను పోలీసులు అరెస్టు చేశారు. వాంగ్మూలాన్ని రికార్డు చేశాక వారి వద్ద సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుల్లో ఒకరైన మహేష్‌.. ఈవ్‌టీజింగ్‌ కేసులో ఇదివరకే నిందితుడిగా ఉన్నాడు.