నీవా బ్రాంచి కెనాల్ ద్వారా చంద్రగిరి మండలం నారావారిపల్లె సమీపంలోని మూలపల్లి చెరువుకు హంద్రీ-నీవా జలాలు రానున్నాయి. రూ.126 కోట్లతో ప్రతిపాదించిన ఈ పనులకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ‘అన్నమయ్య జిల్లా కేవీపల్లెలోని అడవిపల్లి రిజర్వాయర్ నుంచీ చిత్తూరు నగర తాగునీటి అవసరాలకు నిర్మించిన నీవా బ్రాంచి కెనాల్ పాకాల మండలం మీదుగా వెళుతోంది. ఆ కెనాల్ నుంచీ మూలపల్లి చెరువుకు హంద్రీ నీవా నీటిని తరలించి సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తా’నని గత ఎన్నికల్లో పులివర్తి నానీ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం నీవా బ్రాంచి కెనాల్ నుంచీ మూలపల్లి చెరువుకు, అక్కడ్నుంచి మరో నాలుగు చెరువులకు, ఆపై కళ్యాణి డ్యామ్‌కు నీటిని చేర్చేలా రూ.126.06 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాలువ వెంబడి 1154 ఎకరాలకు సాగునీరు.. కళ్యాణి డ్యామ్ ద్వారా తిరుమల, తిరుపతికి తాగునీరూ అందుతుంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.