ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం.. లక్నో వీధుల్లో అలంకరణ మొక్కల లూటీ, వీడియో వైరల్

ఒకవైపు దేశభక్తి, క్రమశిక్షణ, గొప్ప నాయకత్వం గురించి స్ఫూర్తినిచ్చే రాష్ట్ర ప్రేరణ స్థల్ ప్రారంభోత్సవం.. మరోవైపు ప్రధాని వెళ్లిన గంటల వ్యవధిలోనే అక్కడి అలంకరణను అడ్డగోలుగా దోచుకున్న జనం. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో సామాన్యుల కక్కుర్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళిగా అలంకరించిన సుమారు 4,000కు పైగా పూల కుండీలను స్థానికులు పోటీపడి మరీ ఎత్తుకెళ్లారు. కారులో వచ్చే వారు, స్కూటర్లపై వెళ్లేవారు.. ఇలా అందరూ తమకు నచ్చిన కుండీలను చేజిక్కించుకుని పరారయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.