వెనిజులాలో అమెరికా మెరుపుదాడి: ప్రాణభయంతో పారిపోతున్న గెరిల్లా కమాండర్లు.. సరిహద్దుల్లో హై అలర్ట్!

అధ్యక్షుడు నికోలస్ మదురో పతనం కావడంతో.. దశాబ్దాలుగా వెనిజులాను సురక్షిత స్థావరంగా మార్చుకున్న కొలంబియా గెరిల్లా నేతలకు ఇప్పుడు చావు భయం పట్టుకుంది. ఇన్నాళ్లూ మదురో అండతో డ్రగ్స్ మాఫియాను శాసించిన ఈఎల్ఎన్ (ELN), ఫార్క్ (FARC) తిరుగుబాటుదారులు ఇప్పుడు అడవుల బాట పట్టారు. అమెరికా క్షిపణులు తమ స్థావరాలను ఊడ్చిపారేయడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరికలు జారీ చేయడం.. దానికి పెట్రో మాతృభూమి కోసం ఆయుధాలు పడతానంటూ ప్రతిన బూనడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.