హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. సోషల్ మీడియా వెట్టింగ్‌తో వేలాది అపాయింట్‌మెంట్‌లు వాయిదా

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసేతర వీసాలపై (హెచ్-1బీ, హెచ్-4) కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా భారత్‌లో వేలాది హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్‌లు వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా పడ్డాయి. పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్రమ వలసదారులతో పాటు హింస, ఉల్లంఘన కేసుల్లో ఉన్న దాదాపు 85,000 వీసాలను రద్దు చేసినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఈ అనూహ్య వాయిదాలు, రద్దుల కారణంగా లక్షలాది మంది భారతీయ టెక్ నిపుణులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.