'అంతరిక్ష యాత్ర కోసం నా పళ్లు తీయించుకున్నా': వ్యోమగామి శుభాన్షు శుక్లా

గగన్‌యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలో భారత జెండా ఎగుర వేయడానికి సిద్ధం అవుతున్న వ్యోమగాములు, ఆకాశమంత సాహసమే కాదు.. అంతకు మించిన త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తోంది. సాధారణంగా ఎవరైనా పంటి నొప్పితో బాధపడుతుంటేనే భరించలేరు. అలాంటిది శూన్యాకర్షణ ఉండే అంతరిక్షంలో పంటి నొప్పి వస్తే అది ఒక పీడకలగా మారుతుంది. అందుకే నింగిలోకి వెళ్లే ముందే మన భారత వ్యోమగాములు తమ జ్ఞానదంతాలను శాశ్వతంగా వదులుకున్నారు. ఐఐటీ బాంబే వేదికగా జరిగిన కార్యక్రమంలో గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.