ఏపీని భయపెడుతున్న స్క్రబ్ టైఫస్.. 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు.. ఎక్కువగా ఆ జిల్లాలోనే

AP Scrub Typhus Cases: ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే 22 మంది మరణించగా.. గడిచిన రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతుండగా.. తర్వాత స్థానాల్లో తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ కూడా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. అపరిశుభ్రత, అవగాహన లోపమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.