కాంగ్రెస్ ఎమ్మెల్యేల మెడపై మున్సిపల్ ఎన్నికల కత్తి: అభ్యర్థులు ఓడితే ఇక అంతే... ఇన్‌చార్జిలను దించే యోచన

తెలంగాణలో ఇటీవల పంచాయితీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనేమున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది.పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికలు కావడంతో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పోటీ నిచ్చింది. నువ్వా నేనా అన్న రీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ నడిచింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటి ఎన్నికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపిక, ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అయితే ఎవరు బలమైన అభ్యర్థి అవుతారు...వారిలో గెలిచే సామర్థ్యం ఎవరికి ఉంది?అనే అంశాలపై ఇప్పటికే ఎమ్మెల్యేలు తర్జనభర్జనపడుతున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ స్థానాలతో సరిపెట్టుకున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై నాయకత్వం గుర్రుగా ఉంది.పంచాయతీ ఎన్నికలు ఇండిపెండెంట్‌గా జరగడంతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా... మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అస్కారం ఉండదు కాబట్టి. అత్యధిక స్థానాలు గెలుపొంది మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేలా ఇప్పటికే నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది., News News, Times Now Telugu