కెనడాలో భారతీయ సినిమాలపై దాడి.. కాంతార, OG నడుస్తున్న థియేటర్లపై పెట్రోల్ బాంబులు, కాల్పులు

కెనడాలోని ఓక్‌విల్‌లో భారతీయ చలన చిత్రాల ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు హింసాత్మక దాడులను ఎదుర్కొన్న ఒక థియేటర్.. తమ ఉద్యోగులు, ప్రేక్షకులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కాంతార: ఎ లెజెండ్ ఛాప్టర్ 1, దే కాల్ హిమ్ OG సహా అన్ని సౌత్ ఏషియన్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేసింది. సెప్టెంబర్ 25వ తేదీన నిందితులు పెట్రోల్ క్యాన్‌లతో వచ్చి థియేటర్ ప్రధాన ద్వారానికి నిప్పంటించడానికి ప్రయత్నించగా.. అక్టోబర్ 2న జరిగిన మరో దాడిలో ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడులు భారతీయ సినిమాల ప్రదర్శనను ఆపేందుకే చేస్తున్నారని కూడా యాజమాన్యం స్పష్టం చేసింది.