క్రెడిట్ కార్డ్ అప్పులతో బాధపడేవారికి ట్రంప్ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై 10 శాతం పరిమితి

అమెరికాలో మధ్యతరగతి ప్రజలను పట్టిపీడిస్తున్న క్రెడిట్ కార్డ్ అప్పుల విషవలయం నుంచి కాపాడేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సాహసోపేతమైన అస్త్రాన్ని ప్రయోగించారు. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై ఏడాది పాటు కేవలం 10 శాతం గరిష్ట పరిమితి విధించాలని ఆయన ప్రతిపాదించి.. బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు సృష్టించారు. ప్రస్తుతం 20 నుంచి 30 శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యుడి రక్తాన్ని జుర్రుకుంటున్న ఆర్థిక సంస్థలకు ఇది గట్టి దెబ్బ కాగా.. సామాన్య ప్రజలంతా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.