కరూర్ తొక్కిసలాట కేసులో అరెస్టులు.. టీవీకే కార్యదర్శి సహా ఆ నలుగురిని అదుపులోకి..!

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు సోమవారం నాడు కీలక అరెస్టులు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే 41 మంది మృతి చెందగా.. తాజాగా నలుగురిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అందులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జిల్లా కార్యదర్శి మతియళగన్ని ప్రధాన నిందితుడిగా చేర్చారు. అదే పార్టీకి చెందిన మరో ముగ్గురిపై కూడా కేసులు పెట్టి అరెస్టు చేశారు. మరోవైపు టీవీకే నేతలు.. ఇది ప్రమాద వశాత్తు జరిగింది కాదని, కుట్ర చేసే ఇంత మంది ప్రాణాలు తీశారని ఆరోపించారు.