తొలిసారి బీజేపీ సర్కారుపై శశిథరూర్ ఫైర్.. గాంధీ పేరును ఎందుకు తొలగించారంటూ..?

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో వీబీ-జీ రామ్ జీ పేరిట కొత్త చట్టం తీసుకు వచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. పథకం పేరు నుంచి గాంధీ పేరును తొలగించడం అనైతికం అని ఆయన మండిపడ్డారు. గతంలో సొంత పార్టీతో విభేదిస్తూ మోదీ సర్కార్‌ను ప్రశంసించిన థరూర్.. తాజాగా MGNREGA విషయంలో కాంగ్రెస్ వైఖరికి మద్దతుగా నిలబడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.