నల్లమల సాగర్ ప్రాజెక్టుపై పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ.. సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం.. ఎందుకంటే?

పోలవరం- నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు వివాదంపై సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రిట్ పిటిషన్‌కు బదులుగా సివిల్ సూట్ రూపంలో మళ్లీ దాఖలు చేయాలని సీజేఐ సూచించడంతో.. తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ అనుమతులు లేకుండానే నీటిని అధికంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ ప్రాజెక్టుపై సివిల్ సూట్ రూపంలో తెలంగాణ పోరాటం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.