పాక్ ఆర్మీ చీఫ్‌కు ట్రంప్ చుక్కలు.. గాజాకు సైన్యాన్ని పంపాలంటూ తీవ్ర ఒత్తిడి!

పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అపరిమితమైన రాజ్యాంగ అధికారాలు, ఫీల్డ్ మార్షల్ హోదాతో చక్రం తిప్పుతున్న ఆసిమ్ మునీర్ ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన దౌత్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి దళంలో పాక్ సైన్యం చేరాలా? వద్దా? అనే ప్రశ్న ఇప్పుడు ఇస్లామాబాద్‌ను కుదిపేస్తోంది. ఒకవైపు ట్రంప్‌తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, రాబోయే అమెరికా పెట్టుబడులు.. మరోవైపు సైన్యం గనుక గాజా గడ్డపై అడుగుపెడితే దేశంలో విరుచుకుపడే ఇస్లామిక్ గ్రూపుల ఆగ్రహం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న మునీర్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.