ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి కాస్త ముందే..

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.