కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. వాటి కోసం రూ.10 కోట్ల నిధులు మంజూరు..

తెలంగాణలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ (SFC) ద్వారా రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. మంజూరైన ఈ నిధులను మున్సిపాలిటీల్లోని అంతర్గత రోడ్ల మరమ్మతులు, మురుగునీటి కాలవల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ మరియు పెండింగ్‌లో ఉన్న అత్యవసర పనుల కోసం వినియోగించనున్నారు. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిధులను నేరుగా మున్సిపాలిటీలకు మళ్లించారు.