గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో నారా లోకేశ్ భేటీ.. విశాఖ డేటా సెంటర్‌ గురించి ఏం చర్చించారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల సాధన లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేశ్. తాజాగా ఆయన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ భారీ పెట్టుబడి పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డేటా సెంటర్‌పై పనులను ఇరువురు సమీక్షించారు. ఆ తర్వాత ఏపీలో రాబోతున్న డ్రోన్ సిటీలో గూగుల్ పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. గూగుల్‌తో పాటు అడోబీ, ఎన్విడియా, జూమ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.