చైనాపై నిఘాకు భారత్‌ నెత్తిన అమెరికా అణు బాంబు.. వెలుగులోకి 60 ఏళ్ల కోల్డ్ వార్ రహస్యం, ప్రమాదంలో గంగానది

హిమాలయాల్లో దాగి ఉన్న ఓ అణు బాంబు రహస్యం ఇప్పుడు భారత్‌ను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. చైనా అణు పరీక్షల గురించి తెలుసుకునేందుకు భారత్, అమెరికాలు కలిసి చేసిన ఓ ఆపరేషన్ 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పెను ముప్పు భయాలను కలిగిస్తోంది. మంచు కొండల్లో నందా దేవి పర్వత శిఖరంపై వదిలేసి వచ్చిన ఒక అణు పరికరం.. కనిపించకపోవడంపై ఇప్పటికీ తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గంగా నదికి పెను ముప్పుగా భావిస్తున్న ఆ అణు పరికరం జాడ లేకపోవడంతో.. కోట్లాది మంది భారతీయులు ప్రమాదం అంచున ఉన్నారని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఎలాగైనా భారత్, అమెరికాలు కలిసి.. ఆ అణుపరికరాన్ని గుర్తించి.. దశాబ్దాల భయాన్ని పోగొట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.