జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమే, ధనవంతులకు కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాలో జన్మతః పౌరసత్వంపై నెలకొన్న రాజకీయ, న్యాయపరమైన వివాదం డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది. అమెరికా సుప్రీం కోర్టు ఈ వివాదంపై విచారణకు అంగీకరించిన నేపథ్యంలో.. ట్రంప్ తాజాగా మాట్లాడుతూ 14వ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం బానిసల పిల్లలకు పౌరసత్వం ఇవ్వడమేనని.. ఇది ధనిక వలసదారులు అమెరికాలోకి వచ్చి వారి మొత్తం కుటుంబానికి పౌరసత్వం కల్పించుకునే మార్గం కాదని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో ఓటమి పాలైతే అది దేశానికి భారీ నష్టం కలిగిస్తుందని ట్రంప్ హెచ్చరించారు.