ఢిల్లీలో కాలుష్య కల్లోలం: 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి, కార్మికులకు రూ.10 వేల పరిహారం

ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు రాజధాని వాసుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కాలుష్యం నియంత్రణలోకి రాకపోవడంతో ఢిల్లీ సర్కార్ అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అటు వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ నిరాకరించాలని, మరోవైపు జీఆర్‌ఏపీ నిబంధనల వల్ల ఉపాధి కోల్పోయిన పేద కార్మికులకు రూ. 10 వేల నగదు సాయం అందిస్తామని ప్రకటించి తన చిత్తశుద్ధిని చాటుకుంది.